కలం, మానకొండూర్: మండల కేంద్రమైన మానకొండూర్తో పాటు సదాశివపల్లి, జగ్గయ్యపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ (Kavvampally Satyanarayana) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మానకొండూర్, సదాశివపల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో జగ్గయ్యపల్లిలో హాకా ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తమ ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ విజయ్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నందగిరి రవీంద్ర చారి, మార్కెట్ కమిటీ చైర్మన్ రేవెల్లి రాజలింగం, మాజీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, వైస్ చైర్మన్ రేమిడి శ్రీనివాస్ రెడ్డి, మానకొండూర్ పీఏసీఎస్ చైర్మన్ నాగిశెట్టి రాజయ్య, ఊటూరు ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు ఎర్రోళ్ల కవిత చిరంజీవి, తమ్మిశెట్టి రాజేష్, రమణ, సతీష్ కుమార్, వేగోళం శ్రీనివాస్ గౌడ్, కనకం అశోక్, దూలం వీరస్వామి, కే. శ్రీనివాస్ రెడ్డి, రాపాక రాజేశ్వర్, ఎం.సంపత్ రెడ్డి, రామాంజనేయ, విశ్వనాథుల వీరకుమార్, దూలం దేవేంద్ర, అంజిరెడ్డి, తోట శ్రీనివాస్, బండి మల్లేశం, చుక్కారెడ్డి, మడుపు ప్రేమ్ కుమార్, సూర్య తదితరులు పాల్గొన్నారు.

