కలం, జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలోని కేటిదొడ్డి మండలం వెంకటాపురం (Venkatapuram) గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని బుధవారం ఆలయ ఈఓ పురేందర్ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌ను మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వన పత్రిక అందజేశారు.
ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. ఈ మేరకు బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆలయ అధికారులు, నిర్వాహకులను ఆదేశించారు. భక్తులకు తాగునీటి ఎద్దడి రాకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మురళి, తిమ్మారెడ్డి, ఎర్రభీంరెడ్డి, పద్మారెడ్డి, శీను, ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

