రెడ్డి సంక్షేమ సంఘం ఎన్నికలు.. గ్రామాల్లో విస్తృత ప్రచారం

కలం, జగిత్యాల: ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించేలా జరగనున్నాయి. పోటీచేసే అభ్యర్థుల ప్రచారాన్ని చూస్తే అవుననిపిస్తోంది. ఈనెల 29 న జరగనున్న రెడ్డి సంఘం ఎన్నికల కోసం ఇప్పటికే అధ్యక్ష అభ్యర్థులు, ఇతర పదవులకు పోటీ పడే అభ్యర్థులు గ్రామ,గ్రామాన తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

అధ్యక్ష బరిలో నలుగురు..

ఈసారి అధ్యక్ష పదవి కోసం కాసర్ల మధుకర్ రెడ్డి, రొంటాల కేశవ రెడ్డి, ఇనుగాల నాగేశ్వర్ రెడ్డి, వంచ సుదర్శన్ రెడ్డి నలుగురు ప్రముఖ అభ్యర్థులు బరిలో నిలిచి ఎవరికి వారు తమ ప్యానల్ ను సిద్ధం చేసుకున్నారు. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, సంయుక్త కార్యదర్శి వంటి ఇతర కీలక పదవులతో కార్యవర్గ సభ్యులకు పోటీ చేసే అభ్యర్థులతో కలిసి సంయుక్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

దీపావళి తర్వాత నోటిఫికేషన్..

దీపావళి పండుగ అనంతరం 13న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి 14,15 తేదీల్లో నామినేషన్ల ప్రక్రియ చేపట్టొచ్చని సంఘం వర్గాల ద్వారా తెలిసింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థులు ముందస్తు ప్రచారంలో దూసుకుపోతుండటం విశేషం.

6 జిల్లాల్లో ఉత్కంఠగా మారిన రెడ్డి సంఘం పోరు..

ఈ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో నివసిస్తున్న సుమారు 11 వేల వేల మందికి పైగా రెడ్డి బంధువులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కరీంనగర్ రెడ్డి సంఘం భవనంలో 29న ఓటింగ్ జరుగనుండగా, మరుసటి రోజు ఓట్ల లెక్కింపు చేపట్టానున్నారు.

ప్రతి గ్రామంలోని రెడ్డి సంఘం పెద్దలను, యువకులను వ్యక్తిగతంగా కలుస్తూ, వారి మద్దతు కూడగడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా, వాట్సాప్ గ్రూపుల్లో కూడా ప్రచారం హోరెత్తుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఉత్కంఠ మరింత పెరుగుతోంది. ఈసారి ఎవరు అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకుంటారో అని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చర్చ జోరుగా సాగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>