కలం, వెబ్డెస్క్: ఎల్ నినో ప్రభావంతో నీటి, కరెంట్ కష్టాలు రానున్నాయని పాలకులు ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆ కష్టాలను తల్చుకుంటూ ఆందోళన చెంతున్న హైదరాబాద్ (Hyderabad) ప్రజలకు తాజాగా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల సమ్మె (Water Tanker Strike)తో షాక్ తగిలింది. నీటి రవాణా ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల నుంచి ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ ప్రాంతాల్లో ఉన్న హాస్టళ్లను కూడా నీటి కొరత తీవ్రంగా వేధిస్తోంది. విద్యార్థుల కనీస అవసరాలు తీర్చుకోవడం కూడా కష్టంగా మారింది. దీంతో పలువురు ప్రైవేట్ హాస్టళ్ల యజమానులు ఎస్ఆర్నగర్లోని వాటర్ వర్క్స్ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. నీళ్లు లేక హాస్టల్స్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నగరంలో అక్రమ బోర్వెల్స్పై హైడ్రా కొరఢా ఝులిపిస్తోంది. ఇటీవల పలు అక్రమ బోర్లను తొలగించింది. ఈ నేపథ్యంలో వాటర్ ట్యాంకర్ల నిర్వాహకులు సమ్మెకు దిగారు. అటు నీటి కొరత, వాటర్ ట్యాంకర్ల సమ్మెతో ప్రైవేట్ హాస్టళ్లకు పెద్ద కష్టమే వచ్చి పడింది. తమ ప్రాంతాలకు వెంటనే ప్రత్యామ్నాయంగా నీటి సరఫరా ఏర్పాటు చేయాలని హాస్టల్ నిర్వాహకులు ప్రభుత్వాన్ని, హైడ్రాను కోరుతున్నారు. వాటర్ బోర్డు అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
Also Read : సంఘ సంస్కర్తల్లా బిల్డప్ ఇవ్వొద్దు: సందీప్ రెడ్డి వంగా
Follow Us On: X(Twitter)

