రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్!

కలం, వెబ్ డెస్క్ : గురువారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంత్రిమండలి (Telangana Cabinet) సమావేశం కానుంది. ఈ కీలక కేబినెట్ భేటీకి సంబంధించి సీఎస్ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి అజెండాను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా సాయంత్రం 4 గంటలకు అధికారికంగా కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. అయితే అంతకంటే ముందే మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో అనధికారిక భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు రాజకీయాంశాలు, పాలనాపరమైన అంశాలపై చర్చించనున్నారు.

అనంతరం జరగనున్న కేబినెట్ (Telangana Cabinet) భేటీలో ప్రధానంగా తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడుల హబ్‌గా నిలిపేందుకు రూపొందించిన ‘గ్లోబల్ సమ్మిట్(Global Summit)’ నిర్వహణపై చర్చ జరగనుంది. సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం, ఫ్యూచర్ సిటీ ప్రణాళికల ప్రదర్శన, ఏరోస్పేస్, ఫార్మా, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడుల సమీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే సమావేశంలో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, పెండింగ్ ప్రాజెక్టులు, ఇతర ప్రజా సమస్యలపై మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది.

Also Read : సంఘ సంస్క‌ర్త‌ల్లా బిల్డ‌ప్ ఇవ్వొద్దు: సందీప్ రెడ్డి వంగా

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>