కలం, వెబ్‌డెస్క్: ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ (Union Cabinet) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. చిన్నారులపై అరాచకాలు, అఘాయిత్యాల కేసుల విచారణకు ఉద్దేశించిన 850 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను బలోపేతం చేస్తూ వాటి గడువును కేంద్రం పొడిగించింది. పోక్సో కేసుల సత్వర విచారణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. 2026-27 నుంచి 2030-31 వరకు గడువు పొడిగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
ఇక అగ్ని వీర్ల (Agniveer) సర్వీస్ మరో రెండేళ్లు పొడింగించారు. అలాగే సర్వీస్ తర్వాత 25 శాతం అగ్ని వీర్లకు సైనికులుగా ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కీలక ఖనిజాల శుద్ధి రంగానికి రూ.2,814 కోట్ల క్యాపెక్స్ సపోర్ట్ స్కీమ్‌కు కేంద్ర కేబినెట్ (Union Cabinet) ఆమోదం తెలిపింది. 2026-27 నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరాల మధ్య ఐదేళ్ల కాలానికి రూ.2,814 కోట్ల అంచనా వ్యయంతో క్యాపెక్స్ సపోర్ట్ స్కీమ్‌కు ఆమోద ముద్ర లభించింది. లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి కీలక ఖనిజాల స్వదేశీ శుద్ధి సామర్థ్యాన్ని పెంచడం, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ తయారీ, హైటెక్ ఎలక్ట్రానిక్స్ రంగానికి అవసరమైన ముడి పదార్థాల సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్రం తోడ్పాటును అందించనుంది.
Also Read : “యుద్ధానికి అమెరికన్లు నో”.. యూఎస్ ఎన్నికల ఫలితాలపై ఇరాన్ స్పీకర్
Follow Us On : WhatsApp

