epaper
Friday, January 16, 2026
spot_img
epaper

KCRకు ద‌మ్ముంటే కవిత వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలి: అద్దంకి

క‌లం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ (KCR)కు ద‌మ్ముంటే క‌విత వ్యాఖ్య‌లకు స‌మాధానం చెప్పాల‌ని ఎమ్మెల్సీ, టీకాంగ్రెస్ నేత అద్దంకి ద‌యాక‌ర్ డిమాండ్ చేశారు. సొంత కూతురుకే సమాధానం చెప్పలేని వాళ్లు తెలంగాణ సమాజానికి ఏం సమాధానం చెప్తారు? అని ప్ర‌శ్నించారు. పాలకుడిగా ఫెయిలైన కేసీఆర్ కు ఇది కోలుకోలేని దెబ్బ అని ఆయ‌న అన్నారు. క‌విత‌కు వ్య‌తిరేకంగా బీఆర్ఎస్ (BRS) నేత‌లు ప్రెస్ మీట్లు పెట్ట‌డం, మాట్లాడించ‌డం స‌రైంది కాద‌న్నారు.

మీడియా స్పేస్ కోసం ప్ర‌తిరోజు కేటీఆర్‌, హ‌రీశ్ రావు ప్రెస్ మీట్లు పెడతారు. కానీ క‌విత వ్య‌వ‌హ‌రంపై ఎందుకు మాట్లాడ‌టం లేద‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణ పునాదుల మీదుగా ఏర్ప‌డిన బీఆర్ఎస్ , దేశాన్ని దోచుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తే తెలంగాణ ప్ర‌జ‌లు త‌గిన‌ బుద్ధి చెప్పార‌ని అద్దంకి అన్నారు. ఎవ‌రైనా రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌ను ఆహ్వానిస్తారు కానీ.. రాష్ట్రాన్ని దోచుకుంటే ఉరుకోర‌ని అన్నారు. కేసీఆర్ మాదిరిగా రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని న‌డుప‌ర‌ని, గ‌త ప్ర‌భుత్వాన్ని భిన్నంగా నిజాయితీ పాల‌న‌ను కొన‌సాగిస్తున్నార‌ని అద్దంకి  ద‌యాక‌ర్ (Addanki Dayakar) అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>