అంతర్జాతీయ క్రికెట్‌కు ఆసీస్ స్టార్ ప్లేయర్ రిటైర్‌మెంట్!

కలం, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ (Glenn Maxwell) కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఫార్మాట్‌ల క్రికెట్ నుంచి వైదొలిగారు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు విక్టోరియా డొమెస్టిక్ 50 ఓవర్లు, రెడ్-బాల్ మ్యాచ్‌ల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు మంగళవారం వెల్లడించారు. ‘ది ఫైనల్ వర్డ్’ పోడ్‌కాస్ట్ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని ధ్రువీకరించారు.కెరీర్‌లో మిగిలి ఉన్న మిగతా లీగ్ మ్యాచ్‌ల కోసం తన శరీరాన్ని, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాక్స్‌వెల్ తెలిపారు. ఫిబ్రవరిలో శ్రీలంకలో ఒమాన్‌తో జరిగిన టి20 ప్రపంచకప్ మ్యాచ్‌లోనే ఆయన ఆస్ట్రేలియా తరఫున చివరిసారిగా ఆడారు.ఆస్ట్రేలియా తరఫున 149 వన్డేలు, 130 టి20లు, 7 టెస్టులు ఆడిన మాక్స్‌వెల్, వన్డేల్లో 3,990 పరుగులు, టి20ల్లో 2,897 పరుగులు సాధించారు.

ఆస్ట్రేలియా గెలిచిన 2015, 2023 వన్డే ప్రపంచకప్‌లతో పాటు 2021 టి20 ప్రపంచకప్ జట్లలో ఆయన భాగమయ్యారు. టి20ల్లో 5 సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మతో కలిసి ఆయన రికార్డు పంచుకోవడంతో పాటు 128 వికెట్లు తీశారు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో వీడ్కోలు మ్యాచ్ ఆడాలని భావించినా, యువకులకు అవకాశాలు ఇవ్వాలనే సెలక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు ఆయన చెప్పారు. అభిమానులను తన దూకుడు ఆట తీరుతో అలరించిన మాక్స్‌వెల్, తన కెరీర్‌ను గౌరవప్రదంగా ముగించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>