‘వరంగల్’ ప్రాజెక్టులకు కేంద్ర ఆమోదంపై ఆశలు!

కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ నగర అభివృద్ధికి ప్రతిపాదించిన కీలక ప్రాజెక్టులపై (Warangal Development Projects) కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌ (Urban Challenge Fund) కింద చేపట్టనున్న పనులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలపై (డీపీఆర్‌) కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ, మిషన్‌ డైరెక్టర్‌ ఇషా కలియా మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. నగరంలో వరదల నివారణ, పర్యాటక అభివృద్ధి, ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రూపొందించిన ప్రతిపాదనలను అధికారులు ఆమెకు వివరించారు.

హనుమకొండ కలెక్టరేట్‌ నుంచి జిల్లా కలెక్టర్‌, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్‌ బాజ్‌పాయి, మున్సిపల్‌ కమిషనర్‌ టి.వెంకన్న తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాహత్‌ బాజ్‌పాయి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ప్రాజెక్టుల వివరాలను వెల్లడించారు.

నగరంలో భారీ వర్షాలు కురిసినప్పుడు వరదనీరు నిలిచిపోకుండా స్ట్రామ్‌వాటర్‌ డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాల్సిన అవసరాన్ని వివరించారు. దీనికి సంబంధించిన డీపీఆర్‌ సిద్ధం చేసినట్లు పేర్కొంటూ ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని కోరారు. ఖిలా వరంగల్‌లో చారిత్రక మోటు అభివృద్ధి, వరంగల్‌ బస్‌స్టేషన్‌, హనుమకొండ చౌరస్తా అభివృద్ధి, మల్టీలెవల్‌ కార్‌ పార్కింగ్‌ నిర్మాణాలకు సంబంధించిన డీపీఆర్‌లను కూడా సమర్పించారు.

నగర భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ప్రాజెక్టుల ప్రతిపాదనలపై ఇషా కలియా సంతృప్తి వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆమోదం లభిస్తే నగర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఊతం లభించనుంది. ఈ సమావేశంలో జీడబ్ల్యూఎంసీ ఎస్‌ఈ రాజ్‌కుమార్‌, ఈఈ రవికుమార్‌, కుడా సీపీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీంరావు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>