మేడి అఖిల్ హత్య కేసులో మరో ముగ్గురు నిందితుల అరెస్ట్!

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎదురుగడ్డ గ్రామానికి చెందిన మేడి అఖిల్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు కేసు దర్యాప్తును కొనసాగిస్తున్న లక్ష్మీదేవిపల్లి పోలీసులు, ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్న ఎదురుగడ్డ గ్రామానికి చెందిన సురేష్, పవన్, వినోద్‌లను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ ఆదినారాయణ మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఈ సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ, ​అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు వారిని రిమాండ్‌కు తరలించారన్నారు. నిందితుల నుంచి మూడు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ​మేడి అఖిల్ హత్య కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, తాజా దర్యాప్తులో భాగంగా మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి నిందితుల పాత్ర, ఇతర సంబంధిత అంశాలపై పోలీసులు తదుపరి దర్యాప్తును కొనసాగిస్తున్నారన్నారు. ఈ మీడియా సమావేశంలో కొత్తగూడెం సీఐ వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవిపల్లి ఎస్సై అఖిల మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>