epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

బంగ్లాదేశ్‌లో మరో హిందూ హత్య.. 24 గంటల్లో రెండో ఘటన

కలం, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్‌లో (Bangladesh) హిందువులపై హింస కొనసాగుతోంది. గత 24 గంటల్లోనే ఇద్దరు హిందూ వ్యక్తులు హత్యకు గురవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా నర్సింగ్డీ జిల్లాలో వ్యాపారి మోని చక్రవర్తిని హత్య చేశారు. సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో పదునైన ఆయుధాలతో మోనీ చక్రవర్తిని హత్య చేసినట్టు తెలుస్తోంది. దుండగులు ఒక్కసారిగా ఆయన మీద దాడికి తెగబడ్డారు. తీవ్రంగా గాయపడిన చక్రవర్తిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల జషోర్ జిల్లా కోపాలియా బజార్‌లో 45 ఏళ్ల ఫ్యాక్టరీ యజమాని, పత్రిక యాక్టింగ్ ఎడిటర్ అయిన రాణా ప్రతాప్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు ఆయన్ను ఐస్ ఫ్యాక్టరీ నుంచి బయటకు పిలిచి ఓ సందులోకి తీసుకెళ్లి తలలో కాల్చి చంపారు. ఘటన స్థలంలో ఏడు బుల్లెట్ కేసింగ్స్ లభ్యమయ్యాయి.  ప్రతాప్ తలపై దుండగులు మూడుసార్లు కాల్పులు జరిపారని పోలీసులు చెబుతున్నారు.

హిందువులే లక్ష్యంగా దాడులు

బంగ్లాదేశ్ (Bangladesh)  జనాభాలో సుమారు 7 శాతం ఉన్న హిందువులు ప్రధానంగా లక్ష్యంగా మారుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల జెనైదా జిల్లాలో ఓ హిందూ మహిళపై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడి చేశారు. ఆమె వద్ద నుంచి డబ్బు డిమాండ్ చేసిన అనంతరం, ఆమె కేకలు వేయడంతో చెట్టుకు కట్టేసి జుట్టు కత్తిరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఢాకా నుంచి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో ఖోకన్ చంద్ర దాస్ (50)పై దుండగులు దాడి చేసి నిప్పంటించారు. మెడిసిన్, మొబైల్ బ్యాంకింగ్ వ్యాపారం చేస్తున్న ఆయన తన దుకాణం క్లోజ్ చేసి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రాణాలు కాపాడుకోవడానికి చెరువులో దూకినప్పటికీ తీవ్ర గాయాలతో జనవరి 3న ఆస్పత్రిలో మృతి చెందారు. డిసెంబర్ 29న మైమెన్సింగ్‌లో బజేంద్ర బిశ్వాస్ అనే మరో హిందూ వ్యక్తిని ఆయన సహోద్యోగి కాల్చి చంపాడు. బిశ్వాస్ బంగ్లాదేశ్ హోంమంత్రిత్వ శాఖకు చెందిన అన్సార్ బాహినీ సభ్యుడు.

భారత్ ఆందోళన

మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వ హయాంలో 2,900కిపైగా మైనారిటీలపై హింసాత్మక ఘటనలు నమోదయ్యాయని తెలుస్తోంది. బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>