ప్రభుత్వ బడుల్లో చదివే ప్రతి విద్యార్థిపై శ్రద్ధ ఉంచాలి: కలెక్టర్

కలం, ముధోల్: ప్రభుత్వ బడుల్లో చదివే ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు నిరంతరం ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) ఆదేశించారు. మంగళవారం ముధోల్ (Mudhol) మండల కేంద్రంలోని ప్రభుత్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణను పరిశీలించారు. శిథిలావస్థకు చేరిన భవంతిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దాని స్థానంలో నూతన అదనపు తరగతుల నిర్మాణానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. పాఠశాలకు సంబంధించి విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐదవ తరగతి విద్యార్థులతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు.

విద్యార్థులుప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు రావాలని కలెక్టర్ అన్నారు. వారి స్నేహితులెవరైనా బడికి రానట్లయితే, వారిని కూడా తీసుకొని రావాలన్నారు. వారితో లెక్కలు సులభంగా అర్థమయ్యేలా మెలకువలను నేర్పి, కొన్ని లెక్కలు చేయించారు. ఇంగ్లీష్ పదాలను వ్యతిరేక క్రమంలో చదివిపించారు. విద్యార్థుల ప్రతిభను కలెక్టర్ మెచ్చుకున్నారు. పలువురు విద్యార్థులకు పెన్నులను బహుమతులుగా ఇచ్చివారిని అభినందించారు. ఈ తనిఖీలో జిల్లా విద్యాధికారి భోజన్న, తహసిల్దార్ శ్రీలత, ఎంపీడీవో లవకుమార్, డీఎల్ఫీఓ లక్ష్మణ్, సర్పంచ్ షబానా బేగం, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>