“మరో స్కామ్ కు కుట్ర”.. కాంగ్రెస్​ పై జగదీష్ రెడ్డి ఆరోపణలు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం మరో కుంభకోణానికి తెరతీసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy) సంచలన ఆరోపణలు చేశారు. విద్యుత్ కొనుగోళ్ల పేరుతో స్కామ్ కు పాల్పడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న విద్యుత్‌ను ప్రభుత్వం సక్రమంగా సరఫరా చేయలేకతోందన్నారు. అలాంటిది, కొత్తగా విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్ల పేరుతో ప్రజలపై అదనపు భారం మోపేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

ట్రూ–అప్ చార్జీల (True Up Charges) పేరుతో అదనపు వసూళ్లు చేసి ప్రజలపై ప్రభుత్వం భారం మోపేందుకు సిద్ధమవుతోందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేయకుండా, ఆ నిధులను పంచుకునేందు ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. విద్యుత్ ప్లాంట్లను కాంగ్రెస్ ప్రభుత్వం మూసివేసిందన్నారు. నాడు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే తెలంగాణలో దాదాపు 27 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని గుర్తు చేశారు. అయినప్పటికీ రైతులకు సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన (Jagadish Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2014కు ముందు ఉన్న పరిస్థితులు మళ్లీ పునరావృతమవుతున్నాయని జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు.

Also Read : బీజేపీ మహాపాదయాత్ర : నిర్మల్‌ చేరుకున్న సునీల్ బన్సల్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>