కలం, వెబ్ డెస్క్: నేపాల్(Nepal)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోలుఖుంబు జిల్లాలో రెండు హెలికాప్టర్లు గాల్లో ఢీకొని (Helicopter Crash) కూలిపోయాయి. ఈ ఘటనలో భారత పర్యాటకుడు వసంత్ కుమార్ మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం ఉదయం ఖుంబు పసాంగ్ మున్సిపాలిటీ పరిధిలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు. ఫిష్టెయిల్ ఎయిర్, డైనస్టీ ఎయిర్ సంస్థలకు చెందిన హెలికాప్టర్లుగా గుర్తించారు.
వసంత్ కుమార్ మరణించగా, భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ పౌరుడు శైలేష్ కుమార్ పటేల్ గాయపడ్డారు. క్షతగాత్రుడిని హెలికాప్టర్లో ఖాట్మండ్ లోని మెడిసిటి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రెండు హెలికాప్టర్లు ఒకేసారి ల్యాండింగ్ ప్రదేశానికి వచ్చాయి. ఈ క్రమంలో కంట్రోల్ కాకపోవడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి.
Nepal – Two helicopters collided while attempting to land at the Pheriche helipad in Nepal’s Solukhumbu district, killing one foreign national and injuring others in the Mount Everest region. The accident occurred around 8:11 am at the Khumbu Pasang Lhamu Rural Municipality helipad in Pheriche, a key stop on the Everest Base Camp trekking route. CCTV footage of the collision has circulated online.
— NextMinute News (@nextminutenews7) November 3, 2026
Also Read : భారత్ మేకింగ్.. ఇటలీ డిజైనింగ్: మిలాన్ వేదికగా బిగ్ డీల్!
Follow Us On: X(Twitter)

