కలం, నిర్మల్: నిర్మల్ రూరల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కొరిపెల్లి రామ్కిషన్రెడ్డి (Ramkishan Reddy) వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యాయని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ నెల 11న నిర్మల్ పట్టణంలో ‘యువ గర్జన’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అయ్యన్నగారి రాజేందర్, ముత్యం రెడ్డి, మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

