ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసంలో ఆదివాసీ మహిళల సందడి

కలం, నేరడిగొండ: దీపావళి పండుగను పురస్కరించుకుని నేరడిగొండ (Neradigonda) మండల కేంద్రంలోని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) నివాసంలో ఆదివాసులు సందడి చేశారు.

తలమడుగు మండలంలోని సోనాపూర్, లక్ష్మీపూర్ గ్రామాలకు చెందిన ఆదివాసీ మహిళలు మంగళవారం ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని తమ సంప్రదాయ గిరిజన నృత్యాలతో అలరించారు. సంప్రదాయ దుస్తులు ధరించి, గిరిజన సంస్కృతి, ఆచారాలను ప్రతిబింబించేలా చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీంతో ఎమ్మెల్యే నివాసం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>