కలెక్టర్ పేరుతో కొత్త సైబర్ మోసం.. ప్రజలకు అలర్ట్!

కలం, జోగులాంబ గద్వాల: జిల్లా కలెక్టర్ పేరు, ఫొటోతో నకిలీ వాట్సాప్ ఖాతాల ద్వారా డబ్బులు కోరుతున్న సందేశాలను నమ్మవద్దని, ఎవరూ డబ్బులు పంపి మోసపోవద్దని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ (Rizwan Basha Shaik) సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు.

జిల్లా కలెక్టర్ (Collector Rizwan Basha Shaik) పేరు, ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని, ఆయన పేరుతో ముఖ్యంగా 8974808916 నంబర్‌తో ప్రజలకు సందేశాలు పంపిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. తన పేరుతో డబ్బులు కోరుతూ వచ్చే ఇటువంటి సందేశాలు పూర్తిగా నకిలీవని, వాటిని ఎవరూ నమ్మవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు పంపి మోసపోవద్దని జిల్లా కలెక్టర్ ప్రజలకు స్పష్టం చేశారు.

ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న వారిపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించినట్లు వెల్లడించారు. వాట్సాప్‌లో లేదా సోషల్ మీడియాలో కలెక్టర్ ప్రభుత్వ అధికారుల ఫొటోలు,పేర్లు, హోదాలు కనిపించినంత మాత్రాన అవి నిజమైన ఖాతాలని నమ్మవద్దని తెలిపారు. ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్ పేర్లను దుర్వినియోగం చేస్తూ ప్రజలను మోసం చేయడం తీవ్రమైన నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లా కలెక్టర్ లేదా ఇతర అధికారుల పేరుతో డబ్బులు అడిగే వ్యక్తులను నమ్మవద్దని, ఎవరూ మోసపోవద్దని, ఇలాంటి నకిలీ ఖాతాలు లేదా సందేశాలు ఎదురైతే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Also Read : కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా తెలంగాణ: అమిత్ షా

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>