తెలంగాణలో కాంగ్రెస్‌ను ఓడించాలి: అమిత్ షా

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సిన సమయం వచ్చిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) స్పష్టం చేశారు. ఇందుకోసం బీజేపీ కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందన్నారు. సర్దార్ పటేల్ కారణంగా హైదరాబాద్ భారత్‌లో భాగమైందన్నారు. దేశంలో 3 కోట్ల మంది చొరబాటుబాటుదారులున్నారని, వారిని ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందన్నారు. ఆదివారం ఢిల్లీలో ఇండియా కూటమి చొరబాటుదారుల ర్యాలీ చేపట్టారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అండ్ కంపెనీ సర్ ప్రక్రియపై కావాలనే దుష్ప్రచారం చేస్తోందన్నారు.

అప్పుడు సర్ ఎక్కడుంది..?

13 కోట్ల మంది ఓట్లను తొలగించాలని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారని అమిత్ షా (Amit Shah) మండిపడ్డారు. రెండేసి ఓట్లు ఉన్న వారి పేర్లను తొలగించాలా.. వద్దా..? అనేది చెప్పాలన్నారు. తాము సర్ కారణంగానే గెలిచామని చెబుతున్నారని.. 2014, 2019 ఎన్నికల్లో తాము గెలిచినప్పుడు సర్ ప్రక్రియ లేదు కదా..? అని ప్రశ్నించారు. సర్ ప్రక్రియ లేనప్పుడు కూడా బీజేపీ ఎన్నో రాష్ట్రాల్లో గెలిచిన విషయాన్ని మర్చిపోవద్దన్నారు. రాహుల్ గాంధీ ఎప్పటికీ దేశ ప్రధాని కాలేరని తేల్చి చెప్పారు. ఈవీఎంలను తప్పుబడుతున్న రాహుల్ గాంధీ తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎలా గెలిచి ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read : పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు బిగ్ అలర్ట్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>