నివాస ప్రాంతంలో కుప్పకూలిన బిజినెస్ జెట్.. 9 మంది దుర్మరణం

కలం, వెబ్ డెస్క్ : అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో  ఘోర విమాన ప్రమాదం (Florida Plane Crash) చోటుచేసుకుంది. టెక్సాస్‌లోని ఆస్టిన్ నగరం నుంచి బహామాస్‌కు బయలుదేరిన ‘లియర్ జెట్ 60’ రకానికి చెందిన ఒక ప్రైవేట్ బిజినెస్ జెట్, పామ్‌బీచ్ కౌంటీలోని పామ్ స్ప్రింగ్స్ నివాస ప్రాంత సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం తొమ్మిది మంది (సిబ్బందితో కలిపి) ఈ ఘటనలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఆకాశం నుంచి నిమిషానికి వేల అడుగుల వేగంతో కిందకు పడిపోయిన ఈ విమానం, రహదారికి సమీపంలో కూలిపోగానే భారీ విస్ఫోటనంతో చెలరేగిన మంటల్లో దగ్ధమైంది. ప్రమాద తీవ్రతకు రహదారిపై పెద్ద గుంత ఏర్పడగా, దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాద సమయంలో విమానం బాగా ఒరిగిపోయి నియంత్రణ కోల్పోయినట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రికార్డింగ్‌ల ద్వారా వెల్లడైంది.

స్థానిక పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టగా, ముందు జాగ్రత్తగా సమీపంలోని వందలాది మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>