సర్పంచ్ నుంచి మంత్రి.. మచ్చలేని నిజాయితీ నేత వనమా: పువ్వాడ

కలం, ఖమ్మం బ్యూరో: మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు వనమా వెంకటేశ్వరరావు 82వ జన్మదినం సందర్భంగా ఆదివారం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) ఆయనకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వనమా కొత్తగూడెం అభివృద్ధిలో చెరిగిపోని ముద్ర వేశారని ప్రశంసించారు. సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి వరకు ఎదిగి, సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చలేని నిజాయితీ గల నేతగా ఎదిగారని కొనియాడారు.

​ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ.. వనమా తనకు తండ్రితో సమానులని పేర్కొన్నారు. గోదావరి తీర ప్రాంతం నుంచి వచ్చి ఏజెన్సీ ప్రాంత గిరిజనుల అభ్యున్నతికి వారు సేవలు చేశారని కొనియాడారు. కొత్తగూడెం, సింగరేణి ప్రాంతంలో వేలాది కుటుంబాలకు ఉద్యోగాలు, ఇళ్లు ఇప్పించి ఆశాజ్యోతిగా నిలిచారని, మంత్రిగా ఉన్నప్పటికీ పాల్వంచను వీడలేదని గుర్తుచేశారు.

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ అభివృద్ధికి వందలాది కోట్ల నిధులు సాధించడంలో ఆయన పాత్ర కీలకమని పువ్వాడ పేర్కొన్నారు. మంచి రోజుల్లో ఎవరున్నా లేకపోయినా, కష్టకాలంలో వనమా కుటుంబానికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ​ఈ కార్యక్రమంలో నాయకులు RJC కృష్ణ, బచ్చు విజయ్ కుమార్, బొమ్మేర రామ్మూర్తి, పిన్ని కోటేశ్వరరావు, మనీషా లక్ష్మి, బోసు, మాటేటి కిరణ్, మోరంపుడి సాయి, తోట కనకారావు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>