కలం, నిర్మల్: నిర్మల్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS Exam) ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఐదు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 97.41 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న తెలిపారు. జిల్లా నుంచి మొత్తం 889 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 866 మంది పరీక్షకు హాజరయ్యారు. మరో 23 మంది గైర్హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ వివిధ కేంద్రాలను సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించినట్లు డీఈవో పేర్కొన్నారు.

