రామగుండం కమిషనరేట్ పరిధిలో నిషేధాజ్ఞలు : సీపీ

కలం, ​రామగుండం: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జోన్‌లలో నిబంధనలు, నిషేధాజ్ఞలను కొనసాగిస్తున్నట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా (Ramagundam CP Amber Kishore Jha) తెలిపారు. ​ఈ నిషేధాజ్ఞలు నవంబర్ 1 నుంచి నెల రోజులపాటు అమల్లో ఉండనున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు ఉంటాయని సీపీ హెచ్చరించారు. అధిక శబ్దంతో పెట్టే డీజే సౌండ్స్‌ను పూర్తిగా నిషేధించారు. ​మైక్ సెట్ల వినియోగానికి సంబంధిత డివిజన్ ఏసీపీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు.
​
​పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి వేడుకలు, కార్యక్రమాలలో డ్రోన్లను ఎగురవేయరాదన్నారు. పర్మిషన్​ లేకుండా ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, బహిరంగ సభలు నిర్వహించడం నిషేధమని సీపీ అంబర్ కిషోర్​ (Ramagundam CP) తెలిపారు. ​బంద్‌లు, నిరసనల పేరుతో వ్యాపార సముదాయాలు, కార్యాలయాలను బలవంతంగా మూసివేయిస్తే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రజలంతా పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>