వైభవ్‌కు మళ్లీ నిరాశ.. గంభీర్ ఏమన్నాడంటే?!

కలం, స్పోర్ట్స్ : న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్‌ ఇప్పటికే భారత్‌ సొంతమైంది. చివరి టీ20లోనైనా యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి (Vaibhav Sooryavanshi) అవకాశం దక్కుతుందని అభిమానులు ఆశించారు. కానీ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మరోసారి నిరాశపరిచింది. న్యూజిలాండ్‌తో ఐదో టీ20లోనూ వైభవ్‌కు తుది జట్టులో చోటు కల్పించలేదు. దీంతో ఈ సిరీస్‌లో అతడికి దక్కిన అవకాశాలు రెండింటికే పరిమితమయ్యాయి. చివరి మ్యాచ్‌ కోసం భారత్‌ రెండు మార్పులు చేసింది. బౌలింగ్‌ విభాగంలో భువనేశ్వర్‌ కుమార్‌, వరుణ్‌ చక్రవర్తిని జట్టులోకి తీసుకుంది. బ్యాటింగ్‌ కూర్పులో మాత్రం మార్పులు చేయలేదు. సంజూ శాంసన్‌, అభిషేక్‌ శర్మ ఓపెనర్లుగా కొనసాగగా.. ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, తిలక్‌ వర్మ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

వైభవ్‌ ఎంపికపై వస్తున్న విమర్శలపై కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ స్పందించాడు. అందరినీ సంతోషపెట్టడం తన పని కాదని స్పష్టం చేశాడు. జట్టుకు సరైన నిర్ణయాలు తీసుకోవడమే తన బాధ్యతని తెలిపాడు. సోషల్‌ మీడియాలో వచ్చే అభిప్రాయాల కంటే జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తామని చెప్పాడు. జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు చాలామంది ఉన్నారని గంభీర్‌ పేర్కొన్నాడు. అయితే, ఎక్కువ కాలంగా నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని వివరించాడు. అందుకే ఎంపిక విషయంలో జట్టు ప్రయోజనాలనే ప్రాతిపదికగా తీసుకుంటున్నట్లు వెల్లడించాడు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>