హరీష్ రావు రామగుండం పర్యటన.. బీఆర్‌‌ఎస్ శ్రేణుల్లో జోష్ !

కలం, కరీంనగర్ బ్యూరో : బీఆర్‌ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు (Harish Rao) రామగుండం పర్యటనకు వెళ్తున్న వేళ ఆయనకు పెద్దపల్లి బస్టాండ్ వద్ద బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. బీఆర్‌ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు హరీష్ రావును సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం హరీష్ రావు స్థానిక బీఆర్‌ఎస్ నాయకులను పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు. నాయకులతో కొద్దిసేపు మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయనను కలిసిన నాయకులు ఉత్సాహంగా తమ అభివాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు హరీష్ రావుకు కరీంనగర్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వీరి వెంట మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్ శ్రేణులు స్వాగతం పలికారు. ఈ మేరకు మాజీ మంత్రులు‌ కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, చల్ల హరి శంకర్, మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, ముత్యాల బలరాం రెడ్డి హరీష్ రావుకు శాలువా కప్పి స్వాగతించారు. హరీష్ రావు రామగుండం పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్​రేణుల్లో జోష్ కనిపిస్తోంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>