కలం, వెబ్డెస్క్ : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం (Hindupur) మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు చౌడేశ్వరి కాలనీలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (MLA Balakrishna) తన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు హక్కు ప్రజాస్వామ్యం కల్పించిన స్వేచ్ఛ అని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రాంత అభివృద్ధికి కృషి చేసే సమర్థులైన అభ్యర్థులకే ఓటు వేయాలని ప్రజలకు సూచించారు.

