కలం, వెబ్ డెస్క్: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ సేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా ర్యాలీకి తరలివచ్చిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మట్లాడారు. ఇండీ కూటమి మెగా ర్యాలీని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటంలో పార్టీ కార్యకర్తలంతా భాగస్వాములు కావాలని కోరారు. ర్యాలీకి భారీగా తరలివచ్చిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ఉత్సాహాన్ని మహేష్ గౌడ్ అభినందించారు.

