గిరిజనుల చెంతకు ఖాకీల ప్రేమ.. చిన్నారులకు దుస్తుల పంపిణీ

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు భద్రాచలం డివిజన్ పరిధిలోని చర్ల మండలంలో పోలీసు శాఖ (Bhadrachalam Police) మానవతా దృక్పథాన్ని చాటుకుంది. మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు మరింత చేరువయ్యే లక్ష్యంతో చర్ల (Cherla) మండల పరిధిలోని చెన్నాపురం, ఎర్రంపాడు గిరిజన గ్రామాల్లో శనివారం ‘కమ్యూనిటీ కనెక్ట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా రెండు గ్రామాలకు చెందిన సుమారు 100 మంది గిరిజన చిన్నారులకు నూతన దుస్తులను పంపిణీ చేశారు. పోలీసుల చేతుల మీదుగా దుస్తులు అందుకున్న చిన్నారుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.

​ఈ సందర్భంగా భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ (DSP Arun Kumar) స్వయంగా గ్రామాల్లో కలియతిరిగి, ప్రజలతో మమేకమయ్యారు. వారి సమస్యలను ఆప్యాయంగా అడిగి తెలుసుకుని, గిరిజన గ్రామాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, ప్రజలకు అవసరమైన సమయంలో పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం గ్రామస్తులు, తల్లిదండ్రులతో మాట్లాడిన డీఎస్పీ పిల్లల విద్య, ఆరోగ్యం, ఉజ్వల భవిష్యత్తుపై పలు విలువైన సూచనలు చేశారు.

పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపాలని, మెరుగైన విద్యను అందించే దిశగా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డీఎస్పీ పిలుపునిచ్చారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రశాంత వాతావరణం ఏర్పడేందుకు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చర్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) రాజు వర్మ, ఎస్సై నర్సిరెడ్డి, స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>