సీఎం వెడ్స్ జర్నలిస్ట్.. 5 పదుల వయస్సులో కొత్త ప్రయాణం

కలం, వెబ్ డెస్క్ : జమ్మూ కశ్మీర్ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ప్రముఖ జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌ను పెళ్లి చేసుకున్నారు. అక్టోబర్ 30న వీరి వివాహం జరిగింది. శనివారం (అక్టోబర్ 31) సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ ఒక్కటైన విషయాన్ని ఒమర్ అబ్దుల్లా ఎక్స్ వేదికగా వెల్లడించారు. నిధి రజ్దాన్‌తో కలిసి దిగిన ఫొటోలను ఆయన పంచుకున్నారు. నిన్న కొత్త ప్రయాణం ప్రారంభమైంది’ అని ఒమర్ పెట్టిన ఫోటో క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరోవైపు నిధి రజ్దాన్ కూడా తన సోషల్ మీడియా ఖాతాలో ఉంగరం ఎమోజీతో ‘It’s done bro’ అంటూ పోస్టు చేశారు. దీంతో ఈ కొత్త జంటకు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) కు గతంలో పాయల్ అబ్దుల్లాతో పెళ్లి జరగగా ఈ ఏడాది జూలై 31న విడాకులు తీసుకున్నారు. తాజాగా, 56 ఏళ్ల వయస్సులో ఒమర్ అబ్దుల్లా, 49 ఏళ్ల జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌ ను వివాహం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>