ప్రభుత్వ భూములు కాపాడిందే కేసీఆర్: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వ భూములు కాపాడింది కేసీఆర్ అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అబద్ధాలు చెబుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు. అబద్ధాలకు రేవంత్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారని.. ఆ విషయంలో ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. మంచిరేవుల ప్రాంతంలోని 142 ఎకరాల భూములను కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైద్యనాథన్ అనే సీనియర్ లాయర్‌ని నియమించి, వాటిని ప్రభుత్వానికి దక్కేలా కృషి చేశారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి వచ్చాక ఇందులో భూములు అమ్మి రూ.2 వేల కోట్ల స్కాం చేశారని ఆరోపించారు.

భూములు అమ్మే తొందరలో సీఎం..

142 ఎకరాల్లో నుంచి పదెకరాలను రాత్రికి రాత్రే ప్రైవేట్ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేశారని ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. అక్కడ ఉన్న గ్రేహౌండ్స్‌కు సంబంధించిన భూమిని సంతోష్ రెడ్డి అనే వ్యక్తికి ఎలా రిజిస్టర్ చేస్తారని ప్రశ్నించారు. సబ్ రిజిస్ట్రార్ ఎవరి అనుమతితో ఇలా చేశారనేది ప్రజలకు చెప్పాలన్నారు. ఇక్కడ ఎకరం రూ.100 కోట్లుగా ఉందని.. అంటే సుమారు రూ.వెయ్యి కోట్ల విలువైన భూమిని అప్పగించేశారని ఆరోపించారు. మియాపూర్ భూములకు సంబంధించిన సుప్రీం కోర్టు పూర్తి ఆర్డర్ ఇంకా బయటకు రాలేదని.. అప్పుడే అమ్మేద్దామనే సీఎం రేవంత్ రెడ్డి తొందరపడుతున్నారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

Also Read : నిర్మల్‌లో కవిత ‘టీ బ్రేక్‌’ వెనుక మర్మమేమిటి?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>