కలం, స్పోర్ట్స్: సెపాంగ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో జరిగిన మలేషియా గ్రాండ్ ప్రి స్ప్రింట్ రేస్ (Malaysian GP Sprint Race )లో పెడ్రో అకోస్టా (Pedro Acosta) అద్భుత విజయం సాధించారు. వర్షం ముప్పు మధ్య 10 ల్యాప్‌ల పాటు సాగిన ఈ పోటీ తీవ్ర ఉత్కంఠను రేపింది. ఈ విజయంలో అకోస్టా ప్రతిభ కొట్టొచ్చినట్లు కనిపించింది. పోటీ ప్రారంభంలో అలెక్స్ మార్క్వెజ్ ముందంజలో ఉన్నారు. కానీ మరొక నాలుగు ల్యాప్‌లు ఉండగా ఆయన టర్న్ 14 వద్ద కిందపడిపోయారు. దానితో ఐ ఓగురా ఆధిక్యంలోకి వచ్చారు.
చివరికి అకోస్టా (Pedro Acosta) మూడు ల్యాప్‌లు మిగిలి ఉండగా ఓగురాను దాటుకుని ముందుకు వెళ్లారు. ఈ రేస్‌లో మార్క్ మార్క్వెజ్ రెండో స్థానాన్ని దక్కించుకోగా, మార్కో బెజెచి మూడో స్థానంలో నిలిచారు. తొలుత ఆధిక్యంలో ఉన్న ఓగురా వర్షం వల్ల ఇబ్బందిపడి నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. వర్షం పడటంతో కొందరు రౌడర్లు బైక్‌లను మార్చడానికి వెళ్లారు. గాయం కారణంగా జోర్జ్ మార్టిన్ ఈ రేస్ నుంచి వైదొలిగారు. దీంతో మార్క్ మార్క్వెజ్ ఛాంపియన్‌షిప్ ఆధిక్యం 19 పాయింట్లకు పెరిగింది.

