రాప్తాడు విద్యార్థినిపై అటాక్ : నిందితుడు అరెస్ట్

కలం, వెబ్ డెస్క్: రాప్తాడు మండలం అయ్యవారిపల్లెలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి (Raptadu Attack)కి పాల్పడిన ఉన్మాదిని పోలీసులు ధర్మవరం రైల్వే స్టేషన్ దగ్గర అరెస్ట్ చేశారు. ధర్మవరం మండలం నాగలూరుకు చెందిన నిందితుడు హేమంత్, తల్లిదండ్రులు లేకపోవడంతో అయ్యవారిపల్లెలోని తన అక్క ఇంటి వద్ద ఉంటున్నాడు. కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్న నిందితుడు, ఆమె మేనమామ అయ్యి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఉదయం 10:30 గంటల సమయంలో పాఠశాలకు వెళ్లిన నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. పరారీలో ఉన్న నిందితుడిని ధర్మవరంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Also Read : దూసుకొస్తున్న మరో తుఫాన్.. ఏపీకి భారీ వర్ష సూచన!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>