కలం, నిర్మల్: ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని (AITUC Foundation Day) పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపో (Nirmal RTC Depot) వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందని నాయకులు పేర్కొన్నారు.
కార్మికుల ఐక్యతతోనే న్యాయమైన హక్కులను సాధించుకోవచ్చని, ఉద్యోగ భద్రత, వేతనాలు, ఇతర సమస్యల పరిష్కారానికి సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మధు, అధ్యక్షుడు ఎండీ ఫయాజ్, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కేకే దాస్, రమేష్, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.

