కలం, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో తయారైన అత్యాధునిక మెట్రో రైళ్లు ముంబై మెట్రో (Mumbai Metro) సేవలకు సిద్ధమవుతున్నాయి. ముంబై మెట్రో లైన్లు 4, 4A కోసం డ్రైవర్‌లెస్ టెక్నాలజీకి అనువుగా ఈ రైళ్లను రూపొందించారు. ఎల్‌అండ్‌టీ, ఆల్‌స్టోమ్ సంస్థలు సంయుక్తంగా ఆరు కోచ్‌లతో కూడిన 39 మెట్రో రైలు సెట్లను సరఫరా చేయనున్నాయి. ఈ మార్గాల్లో ప్రతి 90 సెకన్లకు ఒక రైలు అందుబాటులో ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఈ సందర్భంగా ఏపీలో తయారైన డ్రైవర్‌లెస్ మెట్రో కోచ్‌లు ముంబైకి వెళ్లడం ఆనందంగా ఉందని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) పేర్కొన్నారు. భారతదేశంలో తయారైన ఉత్పత్తులు నగరాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎలా దోహదపడుతున్నాయో చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ అని తెలిపారు.
Also Read : రోడ్డుపక్కనే రెండు చిరుత పిల్లలు.. రాపూరు ఘాట్‌లో కలకలం!
Follow Us On: X(Twitter)

