కలం, సినిమా : ‘ఎల్లమ్మ’ సినిమాతో హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా ప్రేక్షకులను అలరించేందుకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సిద్ధమవుతున్నారు. ఈ చిత్ర టైటిల్ సాంగ్‌ను (Yellamma Title Song) దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 100 మంది జానపద కళాకారులతో కలిసి రికార్డ్ చేశారు. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు చెందిన కళాకారుల జానపద రిథమ్స్‌తో ఈ పాటను ప్రత్యేకంగా రూపొందించారు.
ఈ పాట ప్రేక్షకులకు సరికొత్త సంగీత అనుభూతిని అందించనుందని చిత్ర బృందం వెల్లడించింది. త్వరలోనే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. వేణు యెల్దండి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మార్చి 5న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

