సత్తుపల్లిలో ముగిసిన మహిళా కబడ్డీ ఛాంపియన్‌షిప్.. విజేతగా నల్లగొండ జట్టు

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా ​సత్తుపల్లి(Sathupalli)లో మువ్వా యూత్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా అత్యంత ఉత్సాహంగా కోలాహలంగా సాగిన 72వ రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ ఛాంపియన్‌షిప్ పోటీలు (State Womens Kabaddi Championship) శుక్రవారంతో అట్టహాసంగా ముగిశాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ టోర్నమెంట్‌లో హోరాహోరీ పోరులో సత్తా చాటిన నల్లగొండ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది.

​ఈ ముగింపు వేడుకలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) తమ సతీమణి మాధురితో కలిసి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు ఖమ్మం – రంగారెడ్డి మధ్య జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్‌ను, ఆ తర్వాత రంగారెడ్డి – నల్లగొండ జట్ల మధ్య జరిగిన ఫైనల్స్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకించి క్రీడాకారిణులను ఉత్సాహపరిచారు. ముగింపులో అద్భుత ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచిన నల్లగొండ జట్టుకు మంత్రి పొంగులేటి ట్రోఫీని బహూకరించి ఘనంగా అభినందించారు.

​ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్రీడా పోటీల్లో గెలుపోటములు సర్వసాధారణమని, క్రీడాకారులు వాటిని పక్కన పెట్టి కేవలం క్రీడా స్ఫూర్తిని మాత్రమే పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన క్రీడా పాలసీని తీసుకువస్తోందని ఆయన స్పష్టం చేశారు.

క్రీడాకారుల అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మంత్రి భరోసానిచ్చారు. అలాగే ఈ టోర్నమెంట్‌ను టీజీఐడీసీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా, విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ​

ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, పార్టీ రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు, టీజీఐడీసీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు, పలువురు ప్రజాప్రతినిధులు, టోర్నీ నిర్వాహకులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>