కలం, నిర్మల్: సమాజంలో చోటుచేసుకుంటున్న వివిధ సంఘటనల నేపథ్యంలో విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి జి. రాధిక అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోమవార్పేట్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సురక్షిత్ బచ్పన్ అభియాన్కా (Surakshit Bachpan Abhiyan) ర్యక్రమంలో ఆమె మాట్లాడారు.
అపరిచిత వ్యక్తులతో మాట్లాడకూడదని, వారు ఇచ్చే బహుమతులను స్వీకరించకూడదని సూచించారు. ఏదైనా సమస్య ఎదురైతే భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధనకు కృషి చేయాలన్నారు. చదువును మధ్యలో ఆపకుండా ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముడారపు పరమేశ్వర్, పట్టణ సీఐ సమ్మయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

