కలం, స్పోర్ట్స్: న్యూజిలాండ్తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ (IND vs NZ) లో 87 పరుగుల తేడాతో ఓటమిపాలవ్వడానికి పవర్ ప్లేలో వికెట్లు కోల్పోవడమే ప్రధాన కారణమని భారత స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే వెల్లడించారు. తొలి ఓవర్లోనే ఓపెనర్లను కోల్పోవడం వల్ల లక్ష్య ఛేదనలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 259 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లు అదనంగా 20 నుంచి 30 పరుగులు సమర్పించుకున్నారని బహుతులే అంగీకరించారు.
వాతావరణ పరిస్థితులు, మైదాన పరిమాణాలు బౌలర్లకు సవాలుగా మారాయని పేర్కొన్నారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. పవర్ ప్లే ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయింది. మిడిల్ ఓవర్లలో తగిన భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోవడంతో నిర్ణీత ఓవర్లలో 172 పరుగులకే పరిమితమైంది. అయితే భవిష్యత్తులో ఈ లోపాలను సరిదిద్దుకుంటామని, రాబోయే వన్డే సిరీస్ కోసం సీనియర్ ఆటగాళ్లు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టారని ఆయన వివరించారు.

