NHM సమ్మెకు ల్యాబ్ టెక్నీషియన్ల సంఘీభావం

కలం, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో గత 18 రోజులుగా కొనసాగుతున్న నిరవధిక సమ్మెకు నాగర్‌కర్నూల్ జిల్లా ల్యాబ్ టెక్నీషియన్ల సంఘం అధ్యక్షుడు కళ్యాణ్ కృష్ణారావు, అసోసియేషన్ సభ్యులు శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ల్యాబ్ టెక్నీషియన్ల సంఘం అధ్యక్షుడు కళ్యాణ్ కృష్ణారావు మాట్లాడుతూ, ప్రజారోగ్య పరిరక్షణలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు (NHM Employees) అందిస్తున్న సేవలు ఎంతో కీలకమైనవని పేర్కొన్నారు. ముఖ్యంగా కోవిడ్‌-19 వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు వైద్య సేవలందించిన ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి పరిష్కdరించాలని కోరారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల పోరాటానికి తమ సంఘం సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.

ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్ మాట్లాడుతూ, ఉద్యోగ భద్రత కల్పించడం, కాంట్రాక్టు మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం, సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం వంటి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 18 రోజులుగా శాంతియుతంగా నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రజలకు నిరంతర ఆరోగ్య సేవలందించడంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, తమ ఉద్యోగ భద్రత, వేతనాలు, ఇతర న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేయాల్సి రావడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి, వారి జీవితాల్లో భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం జరిగే వరకు ఐక్యంగా పోరాటాన్ని కొనసాగిస్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. వివిధ ఉద్యోగ సంఘాలు తమకు సంఘీభావం తెలపడం ఉద్యమానికి మరింత బలాన్ని ఇస్తోందని పేర్కొంటూ ల్యాబ్ టెక్నీషియన్ల సంఘం నాయకులకు, సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌస్ పాషా, ఎన్‌హెచ్‌ఎం జేఏసీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ జగన్, హైమవతి, ప్రవీణ్ కుమార్, రామకృష్ణారెడ్డి, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>