చిట్యాల ఆర్వోబీ మంజూరుకు ఎంపీ వినతి

కలం, నకిరేకల్: నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని రైల్వే గేట్ కారణంగా ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran) కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. చిట్యాల – మునుగోడు ప్రధాన రహదారిలోని రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద తక్షణమే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మంజూరు చేయాలని లేఖ అందించారు. బీబీనగర్ – నడికుడి/నల్లగొండ రైల్వే లైన్‌లో చిట్యాల మున్సిపాలిటీ వద్ద ఉన్న గేట్ దాటితేనే మునుగోడు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలకు వెళ్లే అవకాశం ఉందన్నారు. ఇటీవల ఈ రైల్వే మార్గంలో విద్యుద్దీకరణ పూర్తి కావడంతో రైళ్ల రాకపోకల రద్దీ ఒక్కసారిగా పెరిగిందన్నారు.

మరింత పెరిగిన ప్రయాణికుల కష్టాలు..

ప్రతీ సారి గేటును సుమారు 15 నిమిషాల పాటు మూసివేస్తుండటంతో ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నట్లు ఎంపీ చామల పేర్కొన్నారు. దీనికి తోడు హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి ట్రాఫిక్ కూడా సరిగ్గా ఇదే పాయింట్ వద్ద కలవడంతో ప్రయాణికుల కష్టాలు మరింత పెరిగాయన్నారు. ఈ సమస్య పరిష్కారానికి శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాసిన డీఓ లేఖను రిఫరెన్స్‌గా పేర్కొంటూ ఎంపీ చామల కేంద్ర రైల్వే మంత్రికి ఈ విన్నపం చేశారు. అత్యున్నత ప్రాధాన్యత ప్రాతిపదికన రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌ను మంజూరు చేయాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>