ప్రమాద బాధితులకు బోథ్ ఎమ్మెల్యే ఆపన్నహస్తం..

కలం, బజార్ హత్నూర్: ఇచ్చోడ నుంచి బజార్ హత్నూర్‌కు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో మోడల్ స్కూల్ రోడ్డు వద్ద శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో డ్రైవర్‌తోపాటు ప్రయాణికులు ఆటోలో చిక్కుకుపోయారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) ప్రమాదాన్ని గమనించి వెంటనే తన వాహనాన్ని ఆపారు.

వ్యక్తిగత సహాయకులు, పార్టీ నాయకుల సహాయంతో బోల్తాపడిన ఆటోను పైకి లేపి, అందులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆటోను రోడ్డు పక్కకు జరిపి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఆపద సమయంలో ఎమ్మెల్యే స్వయంగా స్పందించి తమను కాపాడటంతో ప్రయాణికులు, ఆటో డ్రైవర్ కృతజ్ఞతలు తెలిపారు. మానవత్వంతో స్పందించిన ఎమ్మెల్యే తీరుపై స్థానికులు అభినందనలు వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>