1,500 మందికి యెన్నం కిట్ల పంపిణీ: యెన్నం శ్రీనివాస్

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: యెన్నం హెల్త్ కిట్లతో ప్రభుత్వ ఆసుపత్రులపైన ప్రజలకు నమ్మకం పెరిగింద‌ని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. శుక్రవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రసవించిన నవజాత శిశువుల తల్లులకు అవసరమైన వస్తువులతో రూపొందించిన యెన్నం హెల్త్ కిట్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి చెందిన వారు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకుంటే వారికి తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన కిట్ల‌ను పంపిణీ చేస్తున్న‌ట్లు తెలిపారు. నవజాత శిశువుల సంరక్షణకు అవసరమైన వస్తువులను అందించాలనే ఉద్దేశంతో గత ఏడాది నవంబర్ 14వ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. తల్లులకు, నవజాత శిశువులకు అండగా నిలవాలనే సంకల్పంతో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఇప్పటి వరకు సుమారు 1,500 మంది తల్లులకు “యెన్నం హెల్త్ కిట్లను” పంపిణీ చేసినట్లు వెల్లడించారు. నియోజకవర్గానికి చెందిన మహిళలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రతిరోజూ సగటున 7 నుంచి 8 మంది ప్రసవం కోసం వస్తున్నారని తెలిపారు. “యెన్నం హెల్త్ కిట్ల” పంపిణీతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలపై ప్రజల్లో సైతం మరింత నమ్మకం పెరుగుతోందని, నియోజకవర్గంలోని మహిళలు ప్రసవాల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి అధిక సంఖ్యలో వస్తున్నారని పేర్కొన్నారు. తల్లి, బిడ్డ ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఈ సేవా కార్యక్రమాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>