కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి: కవ్వంపల్లి

కలం, బెజ్జంకి: దళారుల మాయమాటలు నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తమ పంటను విక్రయించి మద్దతు ధర పొందాలని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (Kavvampally Satyanarayana) సూచించారు. శుక్రవారం బెజ్జంకి (Bejjanki) మండలంలోని దేవక్కపల్లి, దాచారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత పాటించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందన్నారు. కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా, తూకాల్లో మోసాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

సన్న వడ్లు పండించే రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తోందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని ఎమ్మెల్యే కోరారు.

ఈ కార్యక్రమాల్లో బెజ్జంకి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ ఒగ్గు దామోదర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాతంగి శిరీష అనిల్ కుమార్, మాజీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ పర్ష సంతోష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, దేవక్కపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు మెండె నవీన్, దాచారం సర్పంచ్ బైర మానస సంతోష్, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు మాతంగి అనిల్, నాయకుడు సాధిక్, గూడ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>