అర్నబ్ తుఫాన్ మృతులకు పరిహారం ప్రకటన

కలం, వెబ్ డెస్క్: అర్నబ్ తుఫాన్ (Cyclone Arnab) కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పు పరిహారం అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రాణాపాయం జరగకుండా వీలైనంత మేరకు ప్రయత్నించామని.. ఏడుగురు చనిపోవడం బాధాకరమన్నారు. పంట నష్టపోయిన రైతులకు కూడా నిధులు అందిస్తామని.. ఎంత ఇవ్వాలనేది త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. ఏరియల్ సర్వే అనంతరం నరసాపురంలో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అన్ని జిల్లాల అధికారులు చాలా బాగా పనిచేశారని ప్రశంసించారు.

తుఫాన్ నష్టంపై ప్రాథమిక నివేదికను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించామన్నారు. గోదావరి జిల్లాల్లో పంట ముంపు వీలైనంత తక్కువ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్ని పనులున్నా వాయిదా వేసుకుని.. తుఫాన్ బాధితులను ఆదుకోవడమే ప్రాధాన్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు వివరించారు. ఒకవైపు ఎన్నికలు ఉన్నా, ప్రజలు బాధలో ఉన్నప్పుడు వారి వెంటే ఉండాలని నిర్ణయించుకుని.. జిల్లాల బాట పట్టామన్నారు.

ఏదీ ఆగడానికి వీల్లేదు..

తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉన్నా సంక్షేమం ఆగడానికి వీల్లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఒక వైపు బాధితులకు నష్ట పరిహారం అందిస్తూనే.. ప్రతి నెలా ప్రజలకు కావాల్సిన పింఛన్లు, ఇతర సౌకర్యాలు అందిస్తూనే ఉంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు చేసిన వెంటనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అప్పుడు నష్టం కూడా తగ్గుతుందన్నారు. పంటలకు ఇన్సూరెన్స్ కట్టిన వారికి ఈ సమయంలో కొంత నష్టం తక్కువ ఉంటుందన్నారు. ఈ విషయాన్ని తాను గతంలో చెప్పానని గుర్తు చేశారు. అయినప్పటికీ నష్టపోయిన ప్రతి వ్యక్తిని ఆదుకునే బాధ్యత తమదే అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>