రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని రీ సర్వే పూర్తి చేయాలి: కలెక్టర్

కలం, నిర్మల్ : రోజువారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని రీ సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. శుక్రవారం నర్సాపూర్ (జి) మండలం చాక్ పల్లి గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన భూముల రీ సర్వే వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం రీ సర్వే చేయాల్సిన భూమి, పట్టా భూములు, ఎస్ఆర్ఎస్పీ భూములు, తదితర భూముల వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూముల హద్దుల గుర్తింపు పక్కాగా ఉండాలన్నారు.

స్థానిక రైతుతో కలెక్టర్​ (Bhavesh Mishra) మాట్లాడుతూ.. సాగు చేసిన పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, నీటి కొరత అంశాలను బేరీజు వేసుకొని తక్కువ నీటితో పండే పంటలు మాత్రమే పండించాలని సూచించారు. వ్యవసాయ క్షేత్రంలో పంట కుంటలు (ఫామ్ పాండ్) లు నిర్మించుకోవాలని అన్నారు. పంట కుంటల నిర్మాణంతో భవిష్యత్తులో నీటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయని చెప్పారు. రైతులు తమ పంట పొలాలలో పంట కుంటలు నిర్మించుకునే విధంగా అధికారులు ప్రోత్సహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీకాంత్, సర్వేయర్ విలాస్, సర్పంచ్ సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>