ఓటరు నమోదు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కుంభం

కలం, వలిగొండ: అర్హులైన పట్టభద్రులంతా తమ ఓటును నమోదు చేసుకోవాలని (Graduate Voter Registration) ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Kumbham Anil Kumar Reddy) అన్నారు. శుక్రవారం వలిగొండ మండల కేంద్రంలో వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు నమోదు కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రాన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఓటరు నమోదు కేంద్రంలో జరుగుతున్న ప్రక్రియను, ఆన్‌లైన్ ద్వారా పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునే విధానాన్ని, ఇప్పటివరకు జరిగిన నమోదు ప్రక్రియ పురోగతిని సంబంధిత నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వలిగొండ మండల, పట్టణ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>