ఇండియా కూటమి నేతల కీలక భేటీ

కలం, వెబ్ డెస్క్: నవంబర్ ఒకటో తేదీన ఢిల్లీలో ఇండియా కూటమి (INDIA Alliance) నేతలు భారీ ర్యాలీ నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించేందుకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక భేటీ నిర్వహించారు. రాహుల్ గాంధీ సహా కూటమిలోని ఇతర పార్టీల ముఖ్య నేతలు హాజరయ్యారు. రాంలీలా మైదాన్‌లో సుమారు పది లక్షల మందితో ఈ ర్యాలీ జరిపేలా ఇండియా కూటమి ప్లాన్ చేస్తోంది. ఆ రోజు చేపట్టాల్సిన కార్యక్రమాలు, జన సమీకరణ, కేంద్ర ప్రభుత్వానికి విధించాల్సిన డిమాండ్ల జాబితాపై కూలంకషంగా చర్చించారు. ఇక నుంచి ఆందోళనలను ఒక్క రోజుకే పరిమితం చేయకుండా.. దశలవారీగా దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించాలని యోచిస్తున్నారు.

బస్సులే శరణ్యమా..

నవంబర్ ఒకటో తేదీన ఢిల్లీలో జరిగే ర్యాలీ(Delhi Rally)కి పలు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ నేతలు తరలి వెళ్లేలా ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం ముందుగానే రైళ్లను బుక్ చేసుకున్నా.. చివరి నిమిషంలో ఇవ్వలేమని రైల్వే అధికారులు చేతులెత్తేశారు. తెలంగాణలో ఇదే పరిస్థితి ఎదరైంది. దీంతో ఇక బస్సుల్లోనే ఢిల్లీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి దేశ రాజధానికి రోజుల తరబడి బస్సుల్లో ప్రయాణించి వెళ్లడం నేతలు, కార్యకర్తలకు కష్టంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ర్యాలీకి వచ్చే కార్యకర్తలను వీలైనంత మేరకు కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే కేంద్రం రైళ్ల కేటాయింపును అడ్డుకుంటోందని తెలంగాణ పీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) విమర్శించారు.

Also Read : కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చే వరకు పాదయాత్ర ఆగదు: ఈటల రాజేందర్‌

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>