కలం, నిజామాబాద్ బ్యూరో: నవంబర్ 1వ తేదీన జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో జరిగే ఓట్ బచావో దేశ్ బచావో భారీ సభకు నిజామాబాద్ (Nizamabad) అర్బన్ నుండి బస్సులలో కాంగ్రెస్ నాయకులు (Congress Leaders) భారీగా బయలుదేరారు. నగర కాంగ్రెస్ DCC అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో DCC అధ్యక్షులు నగేష్ రెడ్డి, DCC మాజీ అధ్యక్షులు గడుగు గంగాధర్, నగర మేయర్ ఉమారాణి జెండా ఊపి ప్రయాణాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ సభను విజయవంతం చేయడానికి నిజామాబాద్ నగరంలోని అన్ని డివిజన్ల కాంగ్రెస్ అధ్యక్షులు, కార్పొరేటర్లు ముఖ్య నాయకులను ఒకతాటిపైకి తెచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నిజామాబాద్ నగరం నుండి బస్సుల ద్వారా, ట్రైన్ ల ద్వారా, విమానాల ద్వారా ఇతర రవాణా సౌకర్యాల ద్వారా సుమారు 100 మందికి పైగా డిల్లీకి బయలు దేరుతున్నట్టు వివరించారు.

