కలం, ఆదిలాబాద్: సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ) జనరల్ మేనేజర్ పంకజ్ సింగ్ శుక్రవారం ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జిల్లాలో నూతన గోదాముల నిర్మాణం, ఇప్పటికే ఉన్న నిల్వ సదుపాయాల విస్తరణ, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించే అంశాలపై ఇరువురు చర్చించారు. రైతులు పండించిన పంటలను సురక్షితంగా నిల్వ చేసుకునేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు, జిల్లాలో గోదాముల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించారు. తద్వారా వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు మరింత మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకునే అంశాలపై చర్చించారు.

