నెయ్‌మార్‌‌పై బ్యాన్.. మైదానంలో ఆ పని చేసినందుకు వేటు!

కలం, స్పోర్ట్స్ : బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు నెయ్‌మార్‌కు(Neymar) స్పోర్ట్స్ ట్రైబ్యునల్ బిగ్ షాక్ ఇచ్చింది. మైదానంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆయనపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. గత వారాంతంలో జరిగిన బ్రెజిలియన్ లీగ్ (Brazilian League) మ్యాచ్‌లో బాహియా జట్టు ఆటగాడితో వాదిస్తున్న సమయంలో నెయ్‌మార్‌ తన చేతితో నోరు మూసుకోవడమే దీనికి కారణం. ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్‌లో వినిసియస్ జూనియర్‌ను ఓ ఆటగాడు జెర్సీతో నోరు మూసుకుని జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల తర్వాత ఈ ప్రత్యేక ప్రోటోకాల్ అమలులోకి వచ్చింది.

తాజాగా నెయ్‌మార్‌ చర్యలు ఈ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించాయని క్రీడా ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. ఇప్పటికే పసుపు కార్డుల (యెల్లో కార్డ్స్) పరిమితి దాటడంతో ఒక మ్యాచ్‌ నిషేధం ఎదుర్కొంటున్న నెయ్‌మార్‌కు, ఈ కొత్త వివాదంతో మొత్తం మూడు మ్యాచ్‌ల దూరమయ్యే పరిస్థితి వచ్చింది. పసుపు కార్డుల నిషేధం వల్ల బుధవారం పాల్మీరాస్‌తో జరిగే మ్యాచ్‌కు నెయ్‌మార్‌ దూరమయ్యారు. నోరు మూసుకున్నందుకు విధించిన ఈ కొత్త నిషేధంతో ఆయన నవంబర్ చివరి వరకు మైదానంలోకి దిగే అవకాశం కనిపించడం లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>