పాలమూరును కరువు జిల్లాగా ప్రకటించాలి: శ్రీనివాస్ గౌడ్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రస్తుతం కరువు పరిస్థితుల్లో రైతాంగం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుందని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం మూలంగానే ఇంత అనర్థం జరిగిందన్నారు. గురువారం హన్వాడ మండలం వేపూర్‌లో ఎండిన పంటలను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కృష్ణ పది నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ప్రభుత్వానికి విడుదల చేసిన 60 టీఎంసీల నీటిని తెలంగాణలో పూర్తయిన రిజర్వాయర్లు నింపి ఉంటే పరిస్థితి ఇంత తీవ్రంగా ఉండేది కాదన్నారు. వందల కిలోమీటర్లు కృష్ణా నది ప్రవహిస్తున్న కృష్ణా బేసిన్లో సైతం ఎల్ నినో ప్రభావంతో పంటలు ఎండిపోవడం దురదృష్టకరమన్నారు.

ఏ గ్రామంలో చూసిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉందనీ, చేసేందుకు పనులు లేక తినేందుకు తిండి లేక మళ్లీ వలసలు ప్రారంభం అయ్యాయని, తట్ట.. పారా తీసుకొని ముంబాయి బస్సు లకు పోతున్నారనీ ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తినడానికిని ఇబ్బంది అయ్యే పరిస్థితి వచ్చిందని, ఎనుకటి లెక్క గంజి కేంద్రాలు పెడతారేమో అన్న సందేహం వెలిబుచ్చారు. పచ్చగా ఉన్న రాష్టాన్ని కరువు ప్రాంతంగా మార్చి రైతుల బతుకులు చిన్నాభిన్నం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

రైతుల పంటలు ఎండి పోయాయని, అప్పులు చేసి పెట్టుబడులు తెచ్చుకొని ఇబ్బంది పడుతున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల్లో రైతులు పంటలు వేయవద్దు, ప్రజలు కరెంటు పొదుపుగా వాడాలి అంటున్నారనీ, కానీ దానికి ప్రత్యామ్నాయం ఆలోచన చేయడం లేదన్నారు. కరోనా సమయంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు, కరెంటు, పండించిన పంటలు అన్నింటిని కొన్నామని శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు.

రైతులకు ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం అందించాలని, వెంటనే అధికారులను క్షేత్రస్థాయిలో పంపి పంట నష్టం లెక్క వేయించాలని డిమాండ్ చేశారు. ఇంకా మిగిలిన పంటలు ఎండకుండా 24 గంటల నిరంతర కరెంటు ఇవ్వాలన్నారు. పశువులకు పశు గ్రాసం.. నీళ్లు వంటి సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి తక్షణ సహాయ చర్యలు చేపట్టాలన్నారు. అలాగే తాగునీటికి ఇబ్బంది రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా, మంత్రి, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటన చేసి వాస్తవాలు ప్రభుత్వానికి చెప్పాలన్నారు.

ఈ కార్యక్రమంలో హన్వాడ మాజీ ఎంపీపీ బాలరాజు, మాజీ జెడ్పీటీసీ నరేందర్, హన్వాడ మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణయ్య గౌడ్, సీనియర్ నాయకులు బసిరెడ్డి, శ్రీనివాసులు, జంబులయ్య, చెన్నయ్య, ఖాజా గౌడ్, ఆనంద్, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>